Wednesday, October 7, 2009

వేదంలో తమన్నా

అల్లు అర్జున్‌, మంచు మనోజ్‌, అనుష్కలతో ‘గమ్యం’ ఫేమ్‌ రాధాకృష్ణ అలియాస్‌ ‘క్రిష్‌’ రూపొందిస్తున్న చిత్రంలో తమన్నా కూడా ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ‘హ్యాపీడేస్‌’ తర్వాత ఆ స్థాయి విజయం కోసం ఎదురు చూస్తున్న తమన్నా ప్రస్తుతం తెలుగులో కంటె తమిళంలో బిజీగా ఉంది. తెలుగులోనూ బిజీగా అయ్యేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా తమన్నా ‘వేదం’లో నటించేందుకు తన అంగీకారాన్ని తెలిపినట్లు సమాచారం!